- Advertisement -
దేవర సినిమా తర్వాత దర్శకుడు కొరటాల శివ నెక్ట్స్ సినిమా ఎవరితో ఉండబోతుందోనన్న వార్త టీ టౌన్‌లో చర్చనీయాంశంగా మారింది. అయితే నటుడు నాగచైతన్య కలిసి సినిమా చేయబోతున్నారని వార్తలు సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్‌గా మారింది.
అయితే, ఆ వార్తలు పూర్తిగా తప్పుడు అని, అలాంటి ప్రాజెక్ట్ ఏదీ జరగడం లేదని ఇప్పుడు అధికారికంగా ధృవీకరించబడింది. ప్రస్తుతం చైతూ.. కార్తిక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పౌరాణిక థ్రిల్లర్ NC24 షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.
ఇక కొరటాల శివ మాత్రం దేవర 2 స్క్రిప్ట్ పనుల్లో నిమగ్నమై ఉన్నాడు. ఈ సినిమా 2026 జనవరిలో లాంచ్ అయ్యే అవకాశముంది. అనంతరం షూటింగ్ మొదలవుతుంది. దీంతో వీరిద్దరి కాంబోలో సినిమా ఇప్పట్లో తెరకెక్కేలా కనిపించడం లేదు.
Also Read:పాము బర్త్ డే..యువకుడి అరెస్ట్
- Advertisement -

