చైతూ… మజిలీ ఫస్ట్ లుక్‌

293
majili
- Advertisement -

యంగ్ కపుల్ నాగచైతన్య, సమంత జంటగా ‘నిన్నుకోరి’ ఫేమ్ శివనిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మజిలీ. పెళ్లి తర్వాత చైతు, సామ్ కలిసి నటిస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. ఇటీవలె వైజాగ్,హైదరాబాద్ షెడ్యూల్‌ పూర్తిచేసుకున్న ఈ చిత్రం న్యూఇయర్ కానుకగా గిఫ్ట్‌నందించింది.

సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. ఇది నాకెంతో ప్రత్యేకమైన చిత్రమన్నారు. కొత్త ఏడాదిని ఈ చిత్రంలో ఆరంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ ఆడ్వాన్స్‌ న్యూఇయర్‌ శుభాకాంక్షలు అని తెలిపారు చైతూ. శివ నిర్వాణతో కలిసి పనిచేయడం నా కల. ఏప్రిల్‌లో కలుస్తాం అని తెలిపారు.

ఈ సినిమాలో సమంత రైల్వే క్లర్క్‌ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన భార్యాభర్తల మధ్య వచ్చే చిన్నపాటి తగాదాలు, ప్రేమనురాగాల నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోందట. ఏప్రిల్‌లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

చై, సామ్‌ జంటగా నటిస్తున్న నాలుగో చిత్రమిది. తణికెళ్ళ భరణి, రావు రమేష్, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ రొమాంటిక్ డ్రామాకు గోపీసుందర్ సంగీతం అందిస్తుండగా.. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

- Advertisement -