అదోక చేదు ఘటన : నాగచైతన్య

26
josh
- Advertisement -

లాల్‌ సింగ్‌ చడ్డా ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అక్కినేని యువ స్టార్‌ నాగచైతన్య తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పారు.
నా కెరీర్‌లో ఎన్నో ఎత్తు పల్లాలు చవిచూశానని చెప్పిన… చై కెరీర్‌ ఆరంభంలో ఎదురైన ఓ చేదు ఘటన తననెంతో బాధపెట్టిందని తెలిపారు.

నేను నటించిన మొదటి సినిమా జోష్‌ సినిమాను చూసేందుకు, ప్రేక్షకుల రెస్పాన్స్‌ చూడాలన్న ఉద్దేశంతో ఏంతో ఉత్సాహాంగా ఫస్ట్‌ డే ఓ థియేటర్‌కి వెళ్లా ….. సినిమా మొదలైనప్పుడు బాగానే ఉంది కానీ ఇంటర్వెల్‌కి వచ్చే సరికి చాలా మంది ప్రేక్షకులు మధ్యలోనే థియేటర్ల నుంచి బయటికి వెళ్లిపోవడం చూశనాని చెప్పుకొచ్చారు. అది నా హృదయాన్ని గట్టిగా తాకిందని చాలా బాధనిపించిందని అప్పటి చేదు జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నారు. అప్పటి నుంచి నేనెప్పుడూ థియేటర్‌కు వెళ్లలేదు. ఆ రోజు జరిగిన సంఘటన నా మైండ్‌ లోంచి ఇంకా పోలేదు. కానీ ఏదో ఒక రోజు తప్పకుండా థియేటర్‌కి వెళ్లి సినిమాను ఎంజాయ్‌ చేయాలనుకుంటాన్నా’ అని చై చెప్పుకొచ్చారు.

- Advertisement -