Nagababu: అమాయక జగన్‌కి న్యాయం చేయాలి

27
- Advertisement -

అమాయకుడైన జగన్‌కు న్యాయం చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు జనసేన నేత, మెగాబ్రదర్ నాగబాబు. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన నాగబాబు…2019 కి ముందు అప్పటి ఎమ్మెల్యేగా ఉండి తదనంతరం అంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మారి ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యేగా మిగిలినటువంటి జగన్ మోహన్ రెడ్డి గారికి కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలన్నారు..

ఎందుకంటే 2019 లో శ్రీను అనే వ్యక్తి ఆయన మీద కోడికత్తితో దాడి చేసాడు. 5 ఏళ్లు అయిన కూడా ఆ కేస్ ఇంకా కొలిక్కి రాలేదు.అప్పుడంటే జగన్ మోహన్ రెడ్డిగారి కున్న బిజీ షెడ్యూల్ వల్ల ఆయనకి కుదర్లేదు. ఇపుడు ఆయన ఖాళీగానే ఉన్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వం ఆయనకి న్యాయం చెయ్యాల్సిన అవసరం అత్యవసరంగా ఉందన్నారు. కాబట్టి అతని మీద హత్యాయత్నం చేసిన నేరస్థుడికి సరైన శిక్ష విధించాలి కదా!కాబట్టి ఆయన కేస్ ని తక్షణమే విచారించి అమాయకుడు అయినటువంటి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారికి న్యాయం చెయ్యవలసిందిగా కూటమి ప్రభుత్వాన్ని, సిఎం గారిని, డిప్యూటీ సిఎం గారిని, హోం మంత్రి గారిని కోరుకుంటున్నాను అని ట్వీట్ చేశారు.

Also Read:మల్లన్న సాగర్ నుండి నీళ్లు వదలాలి:వంటేరు

- Advertisement -