మెగా ఫ్యామిలీ మధ్యన విభేదాలు ఉన్నాయని, ఈ మధ్య అవి తారాస్థాయికి చేరుకున్నాయని వార్తలు వచ్చాయి. ‘ఖైదీ నంబర్ 150’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ కు పవన్ హాజరు కాకపోవడం కూడా ఈ వార్తలకు బలం చేకూర్చింది.
అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినపుడు.. దాని వ్యతిరేకించాడు నాగబాబు. మెగా ఫ్యాన్స్ అంతా చిరంజీవి వెంటే ఉండాలని చెప్పడంతో పాటు తను కూడా అన్నయ్య పక్కనే ఉంటానని తెలిపాడు. ప్రస్తుతం నాగబాబు ఆలోచన మారుతున్నట్లు కనిపిస్తుంది. చిరంజీవి నెమ్మదిగా రాజకీయాల్లోంచి తప్పుకుంటూ సినిమాలవైపు వస్తున్న నేపధ్యంలో నాగబాబు తన తమ్ముడి వైపు మొగ్గుచూపుతున్నట్లు కనిపిస్తుంది.
దీనికి కారణం మాత్రం ఇటీవలే జనవరి 26న వైజాగ్ ఆర్కే బీచ్ లో చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు నాగబాబు తన సంపూర్ణ మద్దతు ప్రకటించడం. అంతేకాకుండా తెలుగు యువతను, అభిమానులకు వరుస ట్వీట్లను పెడుతూ అందరినీ ఉత్సాహపరుస్తున్నారు నాగబాబు.. దీని బట్టి చూస్తుంటే 2019 ఎన్నికలకు ముందు నాగబాబు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకుని ఆవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇక తన ఫ్యామిలీతో పవన్ కళ్యాణ్ అంటీ ముట్టనట్లు ఉండటం.. ‘ఖైదీ నెంబర్ 150’ ప్రి రిలీజ్ ఈవెంట్ కు పవన్ దూరంగా ఉండటంపై నాగబాబు స్పందిస్తూ.. ‘‘చిరంజీవి మీద కళ్యాణ్ కు ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు. వాడితో ఉన్న సమస్య ఏంటంటే.. తన ప్రేమను బయటికి వెల్లడించలేడు. అన్నయ్య మీద తన ప్రేమను ఎవరూ శంకించలేరు. ఖైదీ నెంబర్ 150 విషయంలోనూ పవన్ చరణ్ కు ఎంత సపోర్ట్ చేశాడో చాలామందికి తెలియదు. అతను బిజీగా ఉండటం వల్లే ప్రి రిలీజ్ ఈవెంట్కు రాలేకపోయాడు’’ అంటూ తమ్ముడ్ని వెనుకెసుకొచ్చాడు నాగబాబు. ఇదంతా చూస్తే రాబోయే రోజుల్లో పవన్ జనసేనకు నాగబాబు అండగా ఉంటారని పవన్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.