చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో జరిగిన జనసేన బహిరంగ సభలో పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయినప్పటికీ, పథకాలు అమలుకావడం లేదని వ్యాఖ్యానించారు. వైసీపీ గూండాలు, అవినీతి, అక్రమాలు పరాకాష్టకు చేరాయని విమర్శించారు.
నాగబాబు పేర్కొన్న కీలక అంశాల్లో, రూ. 4 వేల పింఛన్, దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించటం, రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో రోడ్ల నిర్మాణం చేపట్టడం, ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం, ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయడం, 48 గంటల్లో రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయడం, విశాఖ ఉక్కు కోసం నిధుల కేటాయింపు, గంజాయి డ్రగ్ నియంత్రణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ తదితర అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయని చెప్పారు.
ఇక పెద్దిరెడ్డి, జగన్, ఇతర వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించిన నాగబాబు, “పెద్దిరెడ్డికే కాదు, జగన్ కుటుంబం కూడా నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డిని సైతం గౌరవించలేదు” అని అన్నారు. రాయలసీమలో 23 వేల ఎకరాల భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకోవడం, శివశక్తి డైరీలో పాల ధర పెంచి రైతులను మోసం చేయడం, గుజరాతీ వ్యాపారిని బెదిరించి ఆస్తులు దోచుకోవడం, ఎర్రచందనం అక్రమ రవాణాకు రోడ్లు నిర్మించడం వంటి అనేక ఆరోపణలు చేశారు.
అంతేకాకుండా, “పెద్దిరెడ్డి అక్రమ సంపాదన రూ. 2 లక్షల కోట్లకు పైగా ఉంది, ఇది రాష్ట్ర బడ్జెట్‌నే మించి పోయింది” అని విమర్శించారు. శాసనసభకు రాకుండా ఉన్న పెద్దిరెడ్డికి ఎమ్మెల్యే పదవి ఎందుకు అంటూ ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా భయపడుతున్నారని, కూటమి కార్యకర్తలు ఓపికతో ఉండాలని, త్వరలోనే అన్ని అక్రమాలు బయటకు తేవాలని అన్నారు.
Also Read:27 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ..
జగన్, పెద్దిరెడ్డి, ద్వారంపూడి సహా వైసీపీ నేతలందరినీ తప్పించకుండా చట్టపరమైన చర్యలకు గురి చేస్తామని నాగబాబు హెచ్చరించారు. “మళ్ళీ గెలిస్తే ఏమి చేస్తారంటున్నారు, కానీ ఇప్పటివరకు రామరాజ్యాన్ని కాదు, రావణరాజ్యాన్నే నడిపారు” అంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు.