ఎన్టీఆర్‌ బయోపిక్‌ని కాదన్న మెగా హీరో..!

226
ntr biopic
- Advertisement -

బాలకృష్ణ-క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ఎన్టీఆర్. దివంగత ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుంది. రోజుకోవార్తతో టీ టౌన్‌లో సెన్సేషన్‌గా మారింది ఎన్టీఆర్ బయోపిక్.

తాజాగా మరో ఆసక్తికర వార్తతో వార్తల్లో నిలిచింది. ఎన్టీఆర్ సినిమా జీవితంలో కీలకపాత్ర పోషించిన నటుల్లో ఎస్వీ రంగారావు ఒకరు. ఈ పాత్ర కోసం మెగా బ్రదర్ నాగబాబును ఎంచుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇందుకోసం దర్శకుడు క్రిష్…నాగబాబును స్వయంగా కలిశారట. అయితే తాను ఆ పాత్రను చేయడానికి సిద్ధంగా లేనని నాగబాబు చెప్పారనటి ఫిల్మ్‌ నగర్‌లో వార్త చక్కర్లు కొడుతోంది. కారణం ఏంటో తెలియదు కానీ నాగబాబు కాదనడంతో వేరే నటుడ్ని ఎంపిక చేసుకున్నారట క్రిష్‌.

ntr biopic nagababu ఎన్టీఆర్ సినీ నేపథ్యంలో జనవరి 9న కథానాయకుడు,రాజకీయ నేపథ్యంలో జనవరి 24న మహానాయకుడు ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటివరకు ఎన్టీఆర్ సినిమాలో నటిస్తున్న పాత్రలను రివీల్ చేస్తూ అందరిని ఆకర్షించింది చిత్రయూనిట్. ఎన్టీఆర్ స‌తీమ‌ణి బ‌స‌వ‌తార‌కం పాత్ర‌లో విద్యా బాల‌న్ ,ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్రలో రానా , ఆయన భార్య భువనేశ్వరి పాత్రలో మలయాళనటి మంజిమా మోహన్ నటిస్తున్నట్టు తెలుస్తుంది. అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్ , హెచ్ఎమ్ రెడ్డి కోసం సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావుగా భరత్ రెడ్డి , ఎన్టీఆర్ కూతురు పురందేశ్వ‌రిగా హిమాన్సీ నటిస్తున్నారు.

- Advertisement -