కూతురు, అల్లుడి కరోనా పరీక్షలపై నాగబాబు స్పందన..

74
Nagababu

మెగా ఫ్యామిలీని కరోనా భయం వెంటాడుతోన్న విషయం తెలిసిందే. క్రిస్మ‌స్ ముందు రోజు సాయంత్రం మెగా ఫ్యామిలీ అంతా రామ్ చ‌ర‌ణ్ ఇంట్లో క్రిస్మ‌స్ వేడుక జ‌రుపుకున్నారు. ఈ వేడుక‌లో ప్ర‌తి ఒక్క‌రు చాలా స‌న్నిహితంగా మెలిగారు. సెల‌బ్రేష‌న్స్ అయిన నాలుగు రోజుల‌కు రామ్ చ‌ర‌ణ్‌, వ‌రుణ్ తేజ్‌ల‌కు క‌రోనా పాజిటివ్ అని రావ‌డంతో ఆ రోజు వేడుక‌లో పాల్గొన్న వారంద‌రు క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకుంటున్నారు. ఉపాస‌న త‌న‌కు క‌రోనా ప‌రీక్ష‌లో నెగెటివ్ వ‌చ్చిన‌ప్ప‌టికీ, వ‌చ్చే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి అని ట్వీట్ చేసింది.

తన కూతురు, అల్లుడు నిహారిక, చైతన్యలకు కరోనా సోకలేదని నాగబాబు స్పష్టం చేశారు. వారిద్దరూ ఇటీవలే హనీమూన్ ట్రిప్పును ఎంజాయ్ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ కరోనా నిబంధనల ప్రకారం నిహారిక, చైతన్య కరోనా పరీక్షలు చేయించుకున్నారని పేర్కొన్నారు. ఈ నెల 26న మాల్దీవులకు వెళ్లకముందు, 29న ముంబై విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత పరీక్షలు చేయించుకున్నారని తెలిపారు. వారిద్దరికీ నెగిటివ్ వచ్చిందని వివరించారు.