సైకిల్‌ని తొక్కేయండి:నాగబాబు

278
nagababu
- Advertisement -

మై ఛానల్, నా ఇష్టం అనే పేరుతో యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించిన మెగాబ్రదర్ నాగబాబు కొంతకాలంగా బాలయ్య,లోకేష్‌లపై సెటైర్లు వేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా టీడీపీ పార్టీ సింబల్‌ సైకిల్ తో నాగబాబు చెడుగుడు ఆడుకున్నాడు.

తెలుగుదేశం పార్టీ సింబల్ ను వాడి ఆ పార్టీ పేరు వాడకుండా సైకిల్‌ని ఏపీ నుంచి తరిమేయండి అంటూ పిలుపునిచ్చారు. నాగబాబు షేర్ చేసిన ఈ వీడియోలో ఇద్దరు పిల్లలు సైకిల్ తో ఆడుకుంటూ ఉంటారు. ఒకరేమో సైకిల్ తొక్కుతూ రౌండ్లు కొడుతుంటే ఇంకో పిల్లాడేమో సైకిల్ ని కాలుతూ ఆగ్రహంతో తొక్కుతూ ఉంటారు.

నాగబాబు వాయిస్ ఓవర్ లో సైకిల్ పై రౌండ్లు వేస్తున్న అబ్బాయిని బాబూ నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగితే ఆరోగ్యం బాగుండాలని సైకిల్ తొక్కుతున్నా అంకుల్ అంటాడు. ఇంకో అబ్బాయిని అడిగితే ఏపీ బాగుండాలని సైకిల్‌ని తొక్కుతున్నాను అంకుల్ అంటాడు… చూశారా అంటూ నాగబాబు తెరమీదకు వచ్చి మీ ఆరోగ్యం బాగుండాలంటే సైకిల్ తొక్కండి. ఆంధ్ర ప్రదేశ్ బాగుండాలంటే సైకిల్ నే తొక్కండి అంటూ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

- Advertisement -