- Advertisement -
ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ,జనసేన,బీజేపీ ఒక్కటయ్యేందుకు పావులు కదుపుతుండగా పవన్ సైతం యాక్టివ్‌గా మారారు. ఇప్పటికే కౌలు రైతుల భరోసా యాత్ర పేరిట పవన్ పర్యటిస్తుండగా తాజాగా మెగాబ్రదర్ నాగబాబు సైతం సిద్ధం అయ్యారు.
జూన్ 1 నుంచి ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు నాగబాబు. ఉత్తరాంధ్రకు చెందిన జనసేన ముఖ్య నేతలు, జిల్లా కమిటీ నేతలు, నియోజకవర్గ కమిటీ నేతలు, వివిధ విభాగాల కమిటీ నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. పార్టీ అభివృద్ధికి శ్రేణుల నుంచి సలహాలు, సూచనలను స్వీకరించనున్నారు.
ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన నేతలతో నాగబాబు సమావేశం కానున్నారు. నాగబాబు పర్యటన కోసం జనసేన నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.
- Advertisement -