న్యూ లుక్‌లో నాగశౌర్య..!

292
naga
- Advertisement -

విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు నాగశౌర్య. సినిమా సినిమాకు వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ మంచి ప్రేక్షకాదరణ పొందిన నాగశౌర్య… హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ 2020 లో డాషింగ్ హీరో 5 వ స్థానాన్ని దక్కించుకున్నాడు.

తాజాగా న్యూ లుక్‌తో కనిపించి అదరగొట్టాడు. మాచో రిప్డ్ లుక్ లో కండలు తిరిగిన దేహదారుఢ్యంతో ఆకట్టుకుంటున్నాడు. శౌర్య తన వ్యక్తిగత శిక్షకుడి సమక్షంలో లాక్డౌన్ సమయంలో కూడా కఠినంగా వర్క్ ఔట్లు చేస్తున్నాడు. మొదటిసారి లాక్డౌన్ సమయంలో తన సిక్స్ ప్యాక్ లుక్ తో అందరూ ఆశ్చర్యపోయేలా చేశాడు శౌర్య.

ప్రస్తుతం వరుడు కావలెను, లక్ష్య, ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి, అనీష్ కృష్ణ దర్శకత్వంలో మరో చిత్రంలో నటిస్తున్నారు నాగశౌర్య.

- Advertisement -