ఎస్ ఆర్ ఎస్ క్రియేషన్ పతాకం ఫై నాగ ప్రణవ్, కావేరి కర్ణిక, ఆద్య హీరో హీరోయిన్లుగా నాగ రాజశేఖర్ దర్శకత్వంలో రూపా శ్రీ, చంద్రమౌళి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ఓ చెలియా.ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను జూబ్లీహిల్స్ రోడ్డు నెం 5 లో ఉన్న హైరిస్ స్టూడియో లో నటులు కుడితి శ్రీనివాస్ అండ్ సతీష్ సారిపల్లె చేతులు మీద ఓపెన్ చేయడం జరిగింది .
ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ రూప శ్రీ అండ్ చంద్రమౌళి మాట్లాడుతూ ఎస్ ఆర్ ఎస్ మూవీ క్రియేషన్స్ బ్యానర్ పైన ఈ మూవీ నీ నిర్మిస్తా ఉన్నాం. ఈ ఓ చెలియా సినిమా కి డైరెక్టర్ నాగ రాజశేఖర్ రెడ్డి చాలా కష్టపడ్డారు . అంతా తానే చూసుకొంటు ఎక్కడ రాజీపడకుండా టైం వేస్ట్ చేయకుండా మంచి టీం నీ సెలెక్ట్ చేసుకొని అనుకొన్న రీతి లో ఔట్పుట్ తీసుకొచ్చారు. హీరో నాగ ప్రణవ్ ఎంతో టాలెంటెడ్ . తను డాక్టర్ గా ఫిలిప్పీన్స్ లో చదువుతూ మూవీ కోసం ఎంతో కష్టపడ్డాడు. హీరోయిన్స్ కావేరి కర్ణిక, ఆధ్య టెక్నీషియన్స్ అందరూ చాలా బాగా వర్క్ చేశారు అన్నారు. మేము మా ఓ చెలియా నీ మార్చ్ లో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నo అని, మీడియా మిత్రులందరూ మా ఈ సినిమా కి సపోర్ట్ చేయాలి అని చంద్రమౌళి గారు అన్నారు.
డైరెక్టర్ నాగ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రొడ్యూసర్ చంద్రమౌళి గారు ఓ చెలియా స్టోరీ లైన్ విని చాలా బాగా ఉంది అని తన ఫ్రెండ్ సహకారం తో ఈ సినిమా నీ నిర్మించారు. ఎక్కడ రాజీపడకుండా మంచి ఔటపుట్ కోసం భాగా సపోర్ట్ చేశారు. హీరో నాగ ప్రణవ్ తను డాక్టర్ గా చదువుతూ యాక్టింగ్ అంటే ఎంతో ఫ్యాషన్ తో తన మొదటి సినిమా అయినా కొత్త యాక్టర్ లా కాకుండ ఒక సీనియర్ యాక్టర్ లా సింగిల్ టేక్ లొ డైలాగ్స్ చెప్పడం గానీ, డ్యాన్స్ లో స్టెప్స్ గానీ , ఫైట్స్ గానీ ఈజీ గా సింగిల్ టేక్ లొ చేస్తూ ఫుల్ ఎనర్జీ తొ చాలా భాగా చేశాడు అని డైరెక్టర్ అన్నారు. హీరోయిన్ కావేరి కర్ణిక మర్యాద రామన్న మూవీ తో ఇండస్ట్రీ కి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంటర్ అయ్యి దూకుడు, రెబెల్ , గ్రీకువీరుడు , సార్ ఇలా 50 సినిమా లు కు పైగా చైల్డ్ ఆర్టిస్ట్ గా పని చేసిన కావేరి మా మూవీ తో హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు అని డైరక్టర్ అన్నారు. వెరీ డెడికేటెడ్ గర్ల్ , టైమ్ టు టైమ్ సెట్ లో ఉండటం వర్క్ లో సిన్సియర్ గా ఉంటూ డైలాగ్స్ పేపర్ ఒకసారి చదువుతే చాలు సింగిల్ టేక్ లో కంప్లీట్ చేసి ఎంతో భాగా సపోర్ట్ చేసింది అని డైరెక్టర్ అన్నారు.
Also Read:ఢిల్లీలో పీవీ మెమోరియల్: కేటీఆర్