ఫుల్‌ జోష్‌లో.. అక్కినేని హీరో !

195
naga-chaitanyas-rarandoi-veduka-chuddam-collections
naga-chaitanyas-rarandoi-veduka-chuddam-collections
- Advertisement -

రారండోయ్… వేడుక చూద్దాం.. అంటూ థియేటర్లలో సందడి చేస్తున్నాడు అక్కినేని నాగచైతన్య. నాగార్జునతో సోగ్గాడే చిన్నినాయన.. వంటి సూపర్ హిట్ మూవీ అందించిన కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులను బాగానే ఆకర్షించింది. ఈసినిమా విడుదలై తొమ్మిది రోజులు కావొస్తోంది. తొమ్మిది రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.35 కోట్లు రాబట్టింది.

నాగ చైతన్య నటించిన సినిమాల్లో తక్కువ రోజుల్లో ఇన్ని కోట్లు రాబట్టిన తొలి సినిమా ఇదే కావడంతో అక్కినేని ఫ్యామిలీ ఫుల్‌ ఖుషీలో ఉంది. ప్రేమమ్ వంటి సూపర్ హిట్ సినిమాలోలాగానే ఈ సినిమాలో కూడా పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. దేవీశ్రీప్రసాద్ అందించిన సంగీతం ఇప్పటికే యూత్ సెల్‌ఫోన్లలో మారుమోగుతున్నాయి.

- Advertisement -