సమంతకి సర్ప్రైజ్ ఇచ్చిన చైతు..

238
- Advertisement -

సమంత నాగ చైతన్య ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనే చెప్పాలి. వీరి పెళ్లి అయిపోయి నెల గడిచిపోయింది. ఈ జంట షూటింగ్ కి ఉదయాన్నే వెళ్లి మళ్లీ సాయంత్రం ఇంటికి వచ్చి సాదారణ భార్య భర్తల్లా చాలా అన్యోన్యతతో ఉంటున్నారు. అయితే ఈ సోమవారానికి కరెక్ట్ గా వీరి పెళ్లి జరిగి నెల రోజులు కావొస్తోంది.

Naga Chaitanya Cooking For His Wife Samantha

దీంతో ఫస్ట్ మంత్ యానివర్సరీ’ని చై-సామ్ చాలా స్పెషల్ గా జరుపుకొన్నారు. ఎంత స్పెషల్ గా అంటే.. చైతన్య తన భార్య కోసం ఎంతో ఇష్టంగా తనకు ఇష్టమైన ప్రత్యేక వంట చేసి సర్ప్రైజ్ చేశాడు. ఈ ఆనందాన్ని సమంత ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. సమంత రంగస్థలం షూటింగ్ కి రెగ్యులర్ గా వెళుతోంది. అయితే నిన్న సమంత ఇంటికి రాగానే చైతు స్పెషల్ వంటకాలు వండిపెట్టాడు. అంతే కాదు.. ఇల్లంతా క్యాండిల్స్ తో డెకరేట్ చేసి ఆశ్చర్యపరిచాడట. చైతు వంట చేసే విధానం యొక్క విడియో ని కూడా పోస్ట్ చేసింది. చైతు లాంటి మంచి భర్త దొరకడం తమ అదృష్టం అని కూడా వివరించింది.

నెటీజన్స్ కూడా లైకులతో బెస్ట్ కపుల్స్ అని స్వీట్ కామెంట్స్ చేశారు. ఇక చైతు కూడా తన సవ్యసాచి రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. మరికొన్ని రోజుల తర్వాత మారుతి డైరెక్షన్ లో చేయబోయే సినిమాను కూడా చైతు స్టార్ట్ చేయనున్నాడు.

- Advertisement -