చైతూ… ‘మంచోడు’ అంటున్న మారుతి

235
Naga Chaitanya and Maruthi film titled Manchodu
- Advertisement -

టాలీవుడ్‌లో చిన్న సినిమాలతో ట్రెండ్ సృష్టించిన దర్శకుడు మారుతి. మొదట్లో యూత్ ను .. మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే కథలను తెరకెక్కిస్తూ వచ్చిన మారుతి, ఆ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్‌ను సైతం ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.భలే భలే మగాడివోయ్ సినిమాతో   రూట్ మార్చిన మారుతి   సీనియర్ హీరోగా వెంకటేష్ హీరోగా బాబు బంగారంతో పరవాలేదనిపించాడు.

ప్రస్తుతం శర్వానంద్ హీరోగా మహానుభావుడు సినిమాను తెరకెక్కిస్తున్నాడు. రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత నాగచైతన్యతో సినిమాను తెరకెక్కించే పనిలో పడ్డాడు మారుతి.

భలే భలే మగాడివోయ్,బాబు బంగారం,మహానుభావుడు మూడు సినిమాల టైటిల్ పరంగా మంచిమార్కులు కొట్టేసిన మారుతి నాలుగో సినిమాకు సైతం అదేఫార్ములాను ఫాలో అయ్యాడు. చైతూతో తెరకెక్కబోయే సినిమాకు  ‘మంచోడు’ అనే టైటిల్ ను నిర్ణయించి దానిని రిజిస్టర్ చేయించాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ సినిమాలో కథానాయికగా మేఘా ఆకాశ్ పేరు వినిపిస్తోంది.

- Advertisement -