Chaitu 25:శివనిర్వాణతో చైతూ!

8
- Advertisement -

తండేల్ సినిమా తర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు నాగచైతన్య. తన 24వ సినిమాను కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో చేస్తుండగా తాజాగా తన 25వ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘మజిలి’ సినిమా ప్రేక్షకాదరణ పొందింది. ఆ తర్వాత నానితో తీసిన టక్‌ జగదీష్‌ బాక్సాఫీస్ వద్ద బోళ్తా పడింది.

ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్‌కి వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం కార్తీక్‌ వర్మ నాగచైతన్యతో తీస్తున్న సినిమాకు ‘వృషకర్మ’ అనే టైటిల్‌ పరిశీలిస్తునట్లు సమాచారం. అన్నపూర్ణ స్టూడియోస్‌ సంస్థ నిర్మిస్తుంది. స్టూడియోలో వేసిన భారీ సెట్‌లో చిత్రీకరణ కొంత పూర్తి చేశారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది.

Also Read:కౌశిక్ అరెస్ట్‌..కక్ష సాధింపు చర్యే:హరీష్

- Advertisement -