తమ్మారెడ్డిపై నాగబాబు షాకింగ్ కామెంట్స్..

79
- Advertisement -

దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజపై షాకింగ్‌ కామెంట్స్ చేశారు నిర్మాత నాగబాబు. నీయమ్మ మొగుడు ఖర్చు పెట్టాడారా 80 కోట్లు R R R కి ఆస్కార్ కోసం (#RRR మీద కామెంటుకు వై.సీ.పీ. వారి భాషలో సమాధానం) అంటూ గట్టి కౌంటర్ ఇచ్చారు.

దర్శకుడురాఘవేంద్రరావు సైతం తమ్మారెడ్డి కామెంట్స్‌ని ఖండించారు. మిత్రుడు భరద్వాజ్ కి, తెలుగు సినిమాకు, తెలుగు సాహిత్యానికి, తెలుగు దర్శకుడికి, తెలుగు నటులకి ప్రపంచ వేదికలపై మొదటి సారి వస్తున్న పేరుని చూసి గర్వపడాలి. అంతే కానీ 80 కోట్ల ఖర్చు అంటూ చెప్పడానికి నీ దగ్గర అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా..? జేమ్స్ కామెరూన్, స్పీల్ బర్గ్ వంటి వారు డబ్బు తీసుకొని మన సినిమా గొప్పతనాన్ని పొగుడుతున్నారని నీ ఉద్దేశమా ? అంటూ ట్వీట్ చేశారు.

ఆర్ఆర్ఆర్ సినిమాపై నిర్మాత తమ్మారెడ్డి చేసిన కామెంట్స్ వివాదానికి కేరాఫ్‌గా మారాయి. RRR టీం ఆస్కార్ ప్రమోషన్స్ కోసం 80 కోట్లు ఖర్చుపెడుతున్నారు. సూట్లు వేసుకొని, ఫ్లైట్స్ టికెట్స్ వేసుకొని డబ్బులు ఖర్చు చేస్తున్నారు. అదే 80 కోట్లు నాకు ఇస్తే ఓ 8 సినిమాలు తీసి మొహాన కొడతాను అనడం వివాదానికి ఆజ్యం పోసింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -