పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి ఇన్ని రోజులైనా…తన పార్టీలోకి అన్నయ్య అయిన నాగబాబును ఇప్పటి వరకూ ఆహ్వానించలేదు. అయితే ఇప్పటికైనా పవన్ తన పార్టీలోకి రమ్మంటే…తాను జనసేనలోకి వెళ్ళేందుకు సిద్దమేనని తెలిపారు నాగబాబు. ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాల్ని వెల్లడించారు నాగబాబు.
అయితే తనని పార్టీలోకి రమ్మనడం, రమ్మనకపోవడం పవన్ ఇష్టమన్నారు. ఒకవేల నాగబాబు జనసేనాలో చేరితే.. అందరిలా తాను జాయిన్ అయి పని చేస్తాను అనడానికి తాను పబ్లిక్ కాదని.. తాను పవన్ అన్నయ్యనని అన్నారు.
తాను పార్టీలోకి వస్తే పవన్‌కు ప్లస్ కాకున్నా ఫర్వాలేదు కానీ మైనస్ కాకూడదని, తనకు పదవులక్కర్లేదని పవన్ పిలిచి పని చేయమంటే ఓ కార్యకర్తగా కూడా పని చేస్తానని తన మనసులోని మాటను బయటపెట్టేశారు నాగాబాబు. అయితే పవన్ తనను పార్టీలోకి పిలవకపోవడానికి కారణం.. లైఫ్‌లో తాను పడ్డ కష్టాన్ని చూశారని.. ఇకపై తాను అంత కష్టపడనక్కర్లేదని ఫీలవుతున్నారన్నారు.
తను ఆరెంజ్ సినిమాతో చాలా దెబ్బతిన్నానని చెప్పిన నాగబాబు, పవన్ కల్యాణ్ చాలా సపోర్ట్ ఇచ్చినా… తాను ఫినాన్షియల్ సిట్యుయేషన్ నుంచి బయటపడాలని మదన పడ్డానని.. బుల్లితెర సపోర్ట్‌తో తాను పరిస్థితులను జయించానన్నారు నాగబాబు. కాగా..పవన్ అంటే తనకు వ్యక్తిగా చాలా ఇష్టమని, వ్యక్తిగా పవన్ అమేజింగ్ పర్సన్ అని నాగబాబు కితాబిచ్చారు.