- Advertisement -
అన్నయ్య చిరంజీవి ప్రేమకు సరిహద్దులుండవని తెలిపారు మెగా బ్రదర్ నాగబాబు. అతని చిరునవ్వు ప్రతి సంఘటనను ఒకవేడుకలా మారుస్తుందని తెలిపారు. నిహారికతో చిరంజీవిది దిగిన ఫోటోను షేర్ చేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు నాగబాబు.
డిసెంబర్ 9న ఉదయ్ పూర్ ప్యాలెస్ వేదికగా చైతన్య-నిహారికల పెళ్లి వేడుక జరగనుండగా, ఈ శుభకార్యానికి మెగా ఫ్యామిలీ అంతా హాజరు కానున్నారు. ఆదివారం నిహారికని పెళ్ళికూతురుని చేసే కార్యక్రమం జరగగా దీనికి మెగాస్టార్ చిరంజీవి తన సతీమణి సురేఖతో హాజరయ్యారు.
డిసెంబర్ 11న హైదరాబాద్‌లోని జె.ఆర్.సి. కన్వెన్షన్ సెంటర్‌లో రిసెప్షన్ జరగనుండగా వెంకట చైతన్య ప్రస్తుతం టెక్ మహేంద్రలో ఉద్యోగం చేస్తున్నారు.
- Advertisement -