చలపతి వ్యాఖ్యలపై నాగ్ స్పందన..

229
Nag on Chalapathi Comments
- Advertisement -

మహిళలపై సినీనటుడు చలపతి రావు వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. చలపతి వ్యాఖ్యలపై మహిళా సంఘాలు తీవ్ర స్ధాయిలో మండిపడుతున్నాయి. ఇక సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఆయనపై తీవ్రస్ధాయిలో ద్వజమెత్తుతున్నారు. సినీనటి రకుల్ సైతం చలపతి వ్యాఖ్యలను తప్పుబట్టింది. ఆయన వయసుకు తగ్గ మాటలు మాట్లాడాలని ఇలాంటి వ్యాఖ్యలతో మహిళలకు ఇబ్బందులు తలెత్తుతాయని వ్యాఖ్యానించింది.

ఇక తాజాగా చలపతి వ్యాఖ్యలపై రారండోయ్ వేడుక చూద్దాం సినిమా నిర్మాత, హీరో నాగార్జున స్పందించారు. చలపతిరావు చేసిన వ్యాఖ్యలు సరికాదంటూ ట్విట్టర్ ద్వారా ఖండించారు. తన వ్యక్తిగత జీవితంలోనూ, తన  సినిమాల్లోనూ మహిళల పట్ల గౌరవం ఉందంటూ నాగార్జున ట్వీట్‌ చేశారు.   మరోవైపు  అసలు ఈ వివాదానికి కారణమైన ‘అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం’ అన్న వ్యాఖ్యపైనే పలువురు మేధావులు, రచయితలు, మహిళా సంఘాల నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.  మరి ఈ అభ్యంతరాలపై  నాగ్ ఎలా స్పందిస్తారో  వేచి చూడాలి.

ఇక ఇదిఇలా ఉండగా  మహిళలను కించపరిచే విధంగా చలపతిరావు వెకిలి వ్యాఖ్యలు చేశారంటూ హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పీఎస్ లో మహిళా సంఘాలు ఫిర్యాదు చేశాయి. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నాయి. తాను చేసిన వ్యాఖ్యలపై చలపతిరావు వివరణ ఇచ్చారు. ప్రతి మగాడి విజయం వెనుక స్త్రీ ఉంటుందని, ట్రంప్, ఒబామా.. ఇలా ఏ ప్రముఖులను చూసినా, తనలాంటి వారిని తీసుకున్నా స్త్రీ సేవలు మరువలేనివని ఆయన చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పేంటో తనకు తెలియదని ఆయన చెప్పారు. ఆడవాళ్లు పక్కలోకి పనికొస్తారంటే… కేవలం సెక్స్ మాత్రమే కాదని ఆయన చెప్పారు. అంతకంటే ఎన్నో ఉన్నత భావాలు చాలా ఉంటాయని చెప్పుకొచ్చారు.

- Advertisement -