బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇవాళ హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా హైదరాబాద్ వస్తుండటంతో పార్టీ నేతలు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. బీజేపి చేపట్టిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా తెలంగాణలో ప్రారంభించేందుకు అయన వస్తున్నారు. బీజేపీ బలోపేతంపై నేతలకు,కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు.
అమిత్ షా టూర్ నేపథ్యంలో కాంగ్రెస్,టీడీపీలకు చెందిన పలువురు నేతలు బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్రవేశారు నాదెండ్ల. ఆయన కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరుతుండటం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్,టీడీపీల నుంచి మాజీ మంత్రులు,ఎమ్మెల్యేలు బీజేపీ గూటికి చేరారు. ఈ నేపథ్యంలో అమిత్ షా టూర్ పార్టీ కేడర్ లో మరింత ఉత్సాహాన్ని నింపుతుందని పార్టీ శ్రేణులు అభిప్రాయ పడుతున్నాయి.