జకోవిచ్‌కు షాకిచ్చిన నాదల్‌

66
nadal
- Advertisement -

ఫ్రెంచ్ ఓపెన్‌లో భాగంగా నోవాక్ జోకోవిచ్‌కు షాకిచ్చాడు రఫెల్ నాదల్. క్వార్టర్ ఫైనల్లో జకోవిచ్‌ను 6-2, 4-6, 6-2, 7-6తో ఓడించి రఫెల్ నాదల్ సెమీ ఫైనల్‌లోకి ప్రవేశించాడు. నాదల్‌ తొలిసెట్‌ను కైవసం చేసుకోగా.. రెండో సెట్‌లో జొకోవిచ్‌ రాణించాడు. ఆ తర్వాత పుంజుకున్న నాదల్‌ రెండు వరుస సెట్లను సాధించి సెమీ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టాడు.

కింగ్‌ ఆఫ్‌ క్లేగా పేరున్న నాదల్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌ను ఇప్పటి వరకు 13 సార్లు గెలిచి కేవలం మూడుసార్లు మాత్రమే ఓటమిపాలయ్యాడు. గతేడాది సెమీ ఫైనల్లో జొకోవిచ్ చేతిలో నాలుగు సెట్లలో నాదల్‌ ఓటమి పాలయ్యాడు. ఆదివారం జరిగే సెమీఫైనల్స్‌లో జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్‌తో తలపడనున్నాడు నాదల్.

- Advertisement -