స్టైల్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్‌గా నభా

3
- Advertisement -

బ్యూటిఫుల్ టాలెంటెడ్ హీరోయిన్ నభా నటేష్ మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ‘స్టైల్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్’ గా ఔట్ లుక్ అవార్డ్ గెల్చుకున్నారు. స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ చేతుల మీదుగా నభా ఈ అవార్డ్ స్వీకరించారు. గ్లామర్ తో పాటు పర్ ఫార్మెన్స్ తో మెప్పించగల హీరోయిన్ గా పేరున్న నభా నటేష్ కు ఈ అవార్డ్ వెల్ డిసర్వడ్ అని అనుకోవచ్చు. స్టైల్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్ గా ఔట్ లుక్ అవార్డ్ గెల్చుకున్న నభా నటేష్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నభా లేటేస్ట్ గా తెలుగులో బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా మూవీస్ చేస్తోంది. నిఖిల్ హీరోగా నటిస్తున్న స్వయంభు మూవీలో నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో ఉంది. అలాగే రీసెంట్ గా నాగబంధం అనే పాన్ ఇండియా మూవీని స్టార్ట్ చేసింది. ఈ రెండు చిత్రాలతో నభా నటేష్ మరోసారి అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. మరికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి.

Also Read:వెల్‌నెస్ రిట్రీట్‌కు కేటీఆర్

- Advertisement -