స్వయం సహాయక బృందాలకు నాబార్డ్ ప్రోత్సాహం..

250
vinod kumar
- Advertisement -

స్వయం సహాయక గ్రూప్ ( SHG ) లకు నాబార్డు ( NABARD ) మరింత ప్రోత్సాహం అందించాలని నాబార్డు సీజెం కృష్ణారావును కోరారు తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్,మంత్రి ఎర్రబెల్లి. రాష్ట్రంలో స్వయం సహాయక గ్రూపు ( SHG ) లకు మరింత ప్రోత్సాహకాన్ని అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ లతో నాబార్డు ( NABARD ) చీఫ్ జనరల్ మేనేజర్ వై. కృష్ణారావు సమావేశమయ్యారు.

బుధవారం మంత్రుల నివాస ప్రాంగణంలోని వినోద్ కుమార్ అధికారిక నివాసంలో జరిగిన ఈ భేటీలో పలు అంశాలపై చర్చించారు. స్వయం సహాయక గ్రూప్ లోని సభ్యులకు మరింత ప్రోత్సాహకాలు అందించాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు.ఈ-శక్తి వేదికగా స్వయం సహాయక గ్రూప్స్ డేటాను అనుసంధానం చేయాల్సిన ఆవశ్యకతపై చర్చించారు.

గ్రామీణ ప్రాంతాల్లో మౌళిక సదుపాయాలతో గోడౌన్స్ ఏర్పాటు చేయడం, ఆర్.ఐ.డీ.ఎఫ్. రోడ్స్, తదితర అంశాలపై చర్చించారు.అంతకు ముందు వినోద్ కుమార్ తో కృష్ణారావు ప్రత్యేకంగా సమావేశమై స్టేట్ క్రెడిట్ 2021 సెమినార్ అంశంపై చర్చించారు. ఈ సెమినార్ లో నాబార్డు చైర్మన్ గోవింద రాజులు, ఎస్బీఐ ఎండీ, వివిధ బ్యాంకుల ఎగ్జిక్యూటివ్ లు పాల్గొననున్నారని, ఈ సెమినార్ ను ప్రారంభించడానికి సీఎం కేసీఆర్ ను ఆహ్వానించాలని వినోద్ కుమార్ ను నాబార్డు సీజీఎం కృష్ణారావు కోరారు.

- Advertisement -