నారప్ప..మునికన్నా ఫస్ట్ లుక్

318
narappa
- Advertisement -

వరుస బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌తో దూసుకెళ్తోన్న విక్టరీ వెంకటేష్‌ తాజా చిత్రం ‘నారప్ప’. తమిళ్‌లో బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా సంచలనం సృష్టించిన ‘అసురన్‌’ చిత్రానికి రీమేక్‌ గా రూపొందుతున్న నారప్ప షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రై.లి, వి క్రియేషన్స్‌ పతాకాలపై డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్‌. థాను సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుండి వెంకటేష్,ప్రియమణి లుక్స్ విడుదల కాగా వీటికి మంచి స్పందనవచ్చింది. తాజాగా నార‌ప్ప పెద్ద కొడుకు మునిక‌న్నా లుక్ విడుద‌ల చేశారు. మునిక‌న్నా పాత్ర‌లో కార్తీక్ ర‌త్నం న‌టిస్తుండ‌గా, ఆయ‌న బ‌ర్త్ డే సంద‌ర్భంగా పోస్ట‌ర్ విడుద‌ల చేశారు.

మణిశర్మ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. శ్యామ్‌ కె నాయుడు ఛాయాగ్రహణాన్ని సమకూర్చుతున్నారు. లాక్‌డౌన్ వ‌ల‌న చిత్ర షూటింగ్‌కి తాత్కాలిక బ్రేక్ ప‌డ్డ విష‌యం తెలిసిందే

- Advertisement -