“నా కిదే ఫస్ట్ టైమ్”.. తొలి షెడ్యూల్ పూర్తి..

491
naakede first time movie
- Advertisement -

శ్రీవల్లిక ప్రొడక్షన్స్ పతాకంపై చింటు కంచర్ల, కావ్య కీర్తి, అదిత్య రెడ్డి కె.ధనుష్ బాబు, సోఫియా,ప్రధాన పాత్రల్లో ముస్కు రాం రెడ్డి దర్శకత్వంలో కురుపాల విజయ్ కుమార్ నిర్మిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ “నాకిదే ఫస్ట్ టైమ్”. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది.

naakede first time movie

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత విజయ్ కుమార్ మాట్లాడుతూ.. మా డైరెక్టర్ రాం రెడ్డి చెప్పిన కథ అద్భుతం గా ఉంది. ఇదో చక్కటి ప్రేమ కథ. ఈ కథలో అనేక ట్విస్టులు ఉంటాయి. మా మూవీలో ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్‌గా ఉంటుంది. సింగర్ శ్రావణ భార్గవి పాడిన సాంగ్ ఈ చిత్రానికి హైలెట్‌గా ఉంటుంది.

naakede first time movie

ప్రేక్షకులను థ్రిల్ చేసే కమర్షియల్ అంశాలన్నీ ఈ చిత్రంలో పొందు పరచడం జరిగింది. దసరా తర్వాత సెకండ్ షెడ్యూల్ ప్రారంబించి గోవా ,అరకులలో పాటల చిత్రీకరణ జరపనున్నాం.” అన్నారు.

ఈ చిత్రానికి సంగీతం: విజయ్ కూరకుల, ఫైట్స్:వజ్రాలు, కెమెరా:గోపి, కో డైరెక్టర్:హర్ష, లైన్ ప్రొడ్యూసర్:ఆగస్టీన్, స్క్రీన్ ప్లే:విజయ్, నిర్మాత: కురుపాల విజయకుమార్, కథ, మాటలు, దర్శకత్వం: ముస్కు రాంరెడ్డి.

- Advertisement -