‘నా సామిరంగ’ పై కొత్త ముచ్చట్లు

24
- Advertisement -

కింగ్ నాగార్జున నటిస్తున్న ‘నా సామిరంగ’ మూవీ నుంచి మరో సాంగ్ రిలీజ్ అయ్యింది. తాజాగా ఈ సినిమాలోని ‘ఇంకా ఇంకా’ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. M.M కీరవాణి రాసిన ఈ సాంగ్‌ను మమన్ కుమార్, సత్య యామిని పాడారు. విజయ్ బిన్నీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఈనెల 14న విడుదల కానుంది. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని UA స‌ర్టిఫికెట్ అందుకుంది. సెన్సార్​ పూర్తి చేసుకున్న నా సామిరంగ సినిమా టోట‌ల్ ర‌న్ టైమ్ 146 నిమిషాలుగా తెలుస్తోంది.

అన్నట్టు సంక్రాంతి అంటే సినిమా పండుగ అని కింగ్ నాగార్జున అన్నారు. ‘నా సామిరంగ’ ప్రీ రిలీజ్‌లో మాట్లాడుతూ.. ఈ సంక్రాంతికి నా సినిమాతోపాటు వస్తున్న గుంటూరు కారం, సైంధవ్, హనుమాన్ మూవీలకు ఆల్ ది బెస్ట్. ఈసారి పండక్కి కిష్టయ్య వస్తున్నాడు (ఈ సినిమాలో పాత్ర పేరు). బాక్సాఫీస్ కొడుతున్నాడు. నాన్నగారి ఆశీస్సులతో ఈ సినిమా చేశాను. కీరవాణి ఎప్పటికప్పుడు మమ్మల్ని ముందుకు తీసుకుని వెళుతూ వచ్చారని చెప్పారు.

డ్యాన్స్ మాస్టర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా నటించిన ఈ మూవీ.. మలయాళ సూపర్ హిట్ మూవీ ‘పోరింజు మరియం జోస్’కి రీమేక్‌గా తెరకెక్కింది. ఈ మూవీలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేయగా అది బాగా వైరల్ అవుతుంది. కాగా, స్నేహం, ప్రేమ, రివెంజ్ డ్రామా కన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ మూవీ జనవరి 14న విడుదల కానుంది.

Also Read:కాంగ్రెసోళ్ళు అంటే కాంగ్రెసోళ్లే!

- Advertisement -