డిఫరెంట్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘ఇంటి నెం.13’ చిత్రానికి సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ ఇప్పటికే ఆడియన్స్‌లో ఒక బజ్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి ఒక ప్రమోషనల్ సాంగ్ ఇప్పుడు మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ‘పుష్ప’ తమిళ్ వెర్షన్‌లోని ‘సామీ..’ పాటను పాడిన రాజలక్ష్మీ ఈ ప్రమోషనల్ సాంగ్‌ను ఎంతో హుషారుగా ఆలపించారు. ఈ పాటలోనే మేకింగ్ విజువల్స్‌ను కూడా జోడించారు. దీంతో సినిమాని ఎంత కష్టపడి తీశారు, ఎలాంటి క్వాలిటీతో చేశారు అనేది ఈ పాట చూస్తే అర్థమవుతుంది.
కాలింగ్‌బెల్, రాక్షసి చిత్రాలతో ఆడియన్స్‌ని థ్రిల్ చేసిన డైరెక్టర్ పన్నా రాయల్ ‘ఇంటి నెం.13’ చిత్రాన్ని ఆ చిత్రాలకు ఎన్నో రెట్లు క్వాలిటీతో రూపొందించారు. కంటెంట్ పరంగా ఇప్పటివరకు వచ్చిన హారర్ సినిమాలకు భిన్నంగా ఉండేలా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ చిత్రాన్ని మార్చి 1న చాలా గ్రాండ్‌గా రిలీజ్ చెయ్యబోతున్నారు. రీగల్ ఫిలిం ప్రొడక్షన్స్ పతాకంపై డా. బర్కతుల్లా సమర్పణలో హేసన్ పాషా ఈ చిత్రాన్ని నిర్మించారు.
విడుదలైన ప్రమోషన్ సాంగ్ గురించి డైరెక్టర్ పన్నా రాయల్ మాట్లాడుతూ..సినిమా కాన్సెప్ట్‌ను, మేకింగ్‌ను తెలియజేసే ఒక ప్రమోషనల్ సాంగ్ ఉంటే బాగుంటుంది అనుకున్నాం. అయితే ఎవరితో ఈ పాటను పాడించాలా అని ఆలోచిస్తున్నప్పుడు ‘పుష్ప’ తమిళ్ వెర్షన్‌లో ‘సామి..’ పాటను పాడిన రాజలక్ష్మీ అయితే బాగుంటుందని ఆమెను సంప్రదించడం జరిగింది. ఆమె ఎంతో హుషారుగా, మరెంతో అద్భుతంగా ఈ పాటను పాడారు. ఈ వీడియోలో మేకింగ్ విజువల్స్‌ని కూడా జోడించడం వల్ల పాటకు ఒక కొత్త అందం వచ్చింది. ఈ పాట మా సినిమా ప్రమోషన్‌కి ఎంతో ఉపయోగపడుతుందన్న నమ్మకం మాకు వుంది. మార్చి 1న విడుదలవుతున్న మా ‘ఇంటి నెం.13’ చిత్రానికి ఘన విజయాన్ని చేకూర్చి మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. హారర్ జోనర్‌లో ‘ఇంటి నెం.13’ డెఫినెట్‌గా ఒక కొత్త ట్రెండ్‌ని క్రియేట్ చేస్తుంది. హాలీవుడ్ టెక్నీషియన్స్‌తో చేయించిన ఈ సినిమాకి పెద్ద ప్లస్‌పాయింట్ అవుతాయి. ఔట్‌పుట్ అద్భుతంగా ఉండాలన్న ఉద్దేశంతో నిర్మాత హేసన్ పాషాగారు ఖర్చుకు వెనకాడకుండా ఎంతో క్వాలిటీగా ఈ సినిమా రావడానికి సహకరించారు. ‘ఇంటి నెం.13’ తప్పకుండా ఇది ప్రేక్షకులకు డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ నిస్తుంది అన్నారు.
నిర్మాత హేసన్ పాషా మాట్లాడుతూ..తెలుగు ఆడియన్స్ ఇప్పటివరకు చూడని ఒక కొత్త తరహా చిత్రం ‘ఇంటి నెం.13’. ఈమధ్యకాలంలో ఆడియన్స్‌ని థ్రిల్ చేసే హారర్ మూవీస్ ఎక్కువగా రాలేదు. ఈ సినిమా డెఫినెట్‌గా ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతినిస్తుంది అన్నారు.
Also Read:ఆ రెండు గ్యారెంటీలు..ఎప్పటినుంచి అంటే?