మొక్కలు నాటిన… మైత్రి మూవీస్ రవిశంకర్

251
mythri gc
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రోజురోజుకు మహా ఉధృతంగా కొనసాగుతోంది ఈ చాలెంజ్ లో పాల్గొనడానికి ప్రముఖులు సెలబ్రిటీస్ వివిధ వర్గాలకు చెందిన వారు ముందుకు వచ్చి ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటడం జరుగుతుంది. అందులో భాగంగా సుధాకర్ చెరుకూరి ఇచ్చిన చాలెంజ్ ను స్వీకరించి మైత్రి బ్యానర్ నిర్మాత Y రవిశంకర్ ఈరోజు మోయినాబాద్ లోని తన వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటడం జరిగింది.

ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టి ఈ రోజు మా అందరి చేత మొక్కలు నటించడం చాలా సంతోషకరం అని దీనిని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

భవిష్యత్ తరాల వారికి మంచి ఆరోగ్యాన్ని ఆకుపచ్చ భారతదేశాన్ని అందించడం కోసం తోడ్పడుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ దర్శకుడు సుకుమార్; మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్; (ఉప్పెన సినిమా) హీరో పంజాబ్ వైష్ణవ్ తేజ్ హిరోయిన్ కృతి శెట్టి; డైరెక్టర్ బుచ్చిబాబు లను ఈ గ్రీన్ ఇండియా చాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

- Advertisement -