అంతుచిక్కని డీకే వైఖరి !

55
- Advertisement -

కర్నాటకలో ఎన్నికలు ముగిసిపోయి కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికి ఆ రాష్ట్రంలో ఆసక్తికర పరిణామాలు ఇంకా చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఆ ఎన్నికల్లో ఊహించని విధంగా విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ.. ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొందో అందరికీ తెలిసిందే. ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి పదవి కోసం ఆ పార్టీలోని మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య మరియు కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ మధ్య తీవ్ర పోటీ ఏర్పడగా..నాలుగు రోజుల సుధీర్ఘ తర్జన భర్జన తరువాత హస్తం హైకమాండ్ సిద్దరామయ్యనే సి‌ఎం గా నియమించింది. అయితే ముఖ్యమంత్రి పదవి ఆశించిన డీకే శివకుమార్ ఆ పదవి దక్కకపోవడంతో పార్టీకి ఎదురుతిరిగే అవకాశం ఉందని అందరు భావించారు. .

ఎందుకంటే ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే పార్టీలో తన వల్ల చీలిక వస్తుందని ఆయనే చేసిన వ్యాఖ్యలే అందుకు కారణం. అయితే రాహుల్ గాంధీ కలుగజేసుకొని డీకేను ఉపముఖ్యమంత్రి చేసి బుజ్జగించారు. అయితే ఆ తరువాత నుంచి డీకే ఊహించని విధంగా ట్విస్ట్ లు ఇస్తూనే ఉన్నారు. ఉపముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తరువాత వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల అనూహ్యంగా డీకేను కలిశారు. అయితే వైఎస్ కుటుంబానికి డీకే శివకుమార్ కు మధ్య ఉన్న సన్నిహిత సంబంధం కారణంగా కలిసి ఉండవచ్చనుకున్నప్పటికి.. రెండవ సారి కూడా భేటీ అయ్యారు. దీంతో రాజకీయం కోసమే అనే భావన అందరిలోనూ ఏర్పడింది.

Also Read: బోనాలు..దేవాలయాలకు ఆర్ధిక సహాయం: తలసాని

కాంగ్రెస్ మరియు షర్మిలా మధ్య ఒప్పందం కోసమే అనే వార్తలు కూడా వినిపించాయి. ఇదిలా ఉంచితే ఎవరు ఊహించని విధంగా బిజెపి నేత మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పతో తాజాగా డీకే శివకుమార్ భేటీ అయ్యారు. ఈ భేటీ పైనే ఇప్పుడు ఆ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. అసలు ఉప్పు నిప్పులా ఉండే కాంగ్రెస్ బిజెపి నేతలు భేటీ కావడం ఎంటనే చర్చ జరుగుతోంది. ఈ చర్చ రాజకీయ పరమైనదా లేదా ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం కారణంగా జరిగిందా అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి డీకే శివకుమార్ ఈ మధ్య వరుసగా కొంతమంది నేతలతో భేటీ అవుతూ కొత్త అనుమానాలకు తెర తీస్తున్నారు.

Also Read: మణిపూర్ సంక్షోభ నివారణకు కమిటీ: అమిత్ షా

- Advertisement -