నా కన్యత్వం మీద వాళ్ళకి డౌటే…!

238
My parents feel that I'm not a virgin-Kangana
- Advertisement -

ఇప్పుడు కంగనా రనౌత్‌ అంటే పెద్ద సంచలనమే. ఎందుకంటే తన నోటి నుండి వచ్చే మాటలు అలాగే ఉంటున్నాయి మరి. అయినా…కంగనకి  ఎలాంటి మొహమాటాలు లేకుండా మాట్లాడడం అలవాటైపోయింది. అందుకే తాను నోరు విప్పిన ప్రతిసారి అన్నీ నిర్మహమాటంగా  చెప్పేస్తోంది. దాన్నే భయపడకుండా నిజాలు చెప్పడం అని కూడా కొందరి అభిప్రాయం. అయితే ఇప్పుడు మరో సంచలన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది.

ఈ అమ్మడు ఏ విషయం గురించైనా కూడా  చాలా ఓపెన్‌గా చెబుతూ అందర్నీఆశ్చర్యానికి గురి చేస్తుంది. తాజాగా కంగనా ‘రంగూన్‌’ చిత్ర ప్రమోషన్‌లో పాల్గోంటూ తన గురించి చాలా ఓపెన్‌గా మాట్లాడిరది. ఈ అమ్మడి తల్లిదండ్రులు కంగనాకు కన్యత్వం లేదని అనుకుంటారట. ఈ విషయం కంగననే చెప్పింది. ఎందుకంటే…కంగనా తల్లిదండ్రులు కంగనాకు ఉన్న గత బాయ్‌ఫ్రెండ్స్‌ను చూసి ఈమెకు కన్యత్వం లేదని అనుకుంటారట.  కన్యత్వం గురించి డైరెక్ట్‌గా అడగకున్నా కూడా తన కన్యత్వం పై ఆమె తల్లిదండ్రులు అనుమానంగానే ఉంటారని కంగనా ఓపెన్‌గా చెప్పుకొచ్చింది.
 My parents feel that I'm not a virgin-Kangana
కానీ.. తాను మాత్రం అలాంటిది కాదని, తన కన్యత్వం గురించి వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదని ఈ అమ్మడు చెప్పుకొచ్చింది. గతంలో భాయ్‌ప్రెండ్స్‌ గురించి, బాలీవుడ్‌ దర్శక నిర్మాతలు, హీరోల గురించి కంగనా చేసిన షాకింగ్‌ కామెంట్స్‌ మరవక ముందే తన కన్యత్వం గురించి ఘాటు వ్యాఖ్యలు చేసి హాట్‌ టాఫిక్‌గా మారింది.

ఇక సినిమా అంటే.. అన్నీ చూపించాలని అందుకు తాను సిద్దంగా ఉన్నానని కూడా వెల్లడించింది. అలా అని తనను చులకనగా చూడొద్దని, సినిమా తన ప్రొపెషన్‌ అంటూ సినిమాలో తానే చేసిన న్యూడ్‌ సీన్ల గురించి ఈ అమ్మడు ఇటీవలే ఆసక్తికరంగా మాట్లాడింది.

- Advertisement -