గ్రీన్ ఛాలెంజ్..మొక్కలు నాటిన మైహోం రామెశ్వర్ రావు

427
Rameshwar Rao
- Advertisement -

ఎంపీ సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు ప్రభుత్వ అధికారులు కూడా గ్రీన్‌ ఛాలెంజ్ సవాల్ ను స్వీకరించి మొక్కలు నాటుతున్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి, తెలంగాణ రాష్ట్ర రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్‌మెంట్ కమిషనర్ అండ్ ఐజీ టి.చిరంజీవులు చేసిన గ్రీన్ ఛాలెంజ్‌ ను స్వీకరించారు మైహోం గ్రూప్ సంస్ధల చైర్మన్ జూపల్లి రామేశ్వర్ రావు.

హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీలో మైహోమ్‌ గ్రూపు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మైహోమ్ భూజ ప్రాంగణంలో డాక్టర్ రామేశ్వరరావు బుధవారం మొక్కలు నాటారు. అనంతరం సీనియర్ ఐఏఎస్ అధికారి, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ అరవింద్‌ కుమార్‌కు, ప్రముఖ తెలుగు సినిమా డైరక్టర్ వంశీ పైడిపల్లికి, టీవీ9 డైరెక్టర్‌ సింగారావుకు గ్రీన్‌ ఛాలెంజ్ చేశారు. ఈసందర్భంగా రామేశ్వర్ రావు మట్లాడుతూ ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంతోష్ కుమార్ అభినందనలు తెలిపారు.

- Advertisement -