మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూపు ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ అకౌంట్ లో ఓ వీడియోని పోస్ట్ చేశారు. ఇప్పుడది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాళ్లు, చేతులు లేని ఓ చిన్నారి జారుడు బల్ల ఎక్కేందుకు పడుతున్న తపన ఆనంద్ మహీంద్రా ను కదిలించింది. దాంతో ఆ వీడియోను షేర్ చెయ్యకుండా ఉండలేకపోయారు ఆనంద్ . ఓ పాప హాయిగా ఆడుతూ పాడుతూ జారుడు బల్ల మీద నుంచి జారుతుంటుంది.
దాన్ని చూసి మరో చిన్నారి కూడా జారుడు బల్లపైకి చేరుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఆ పాప సంకల్పం ముందు ఆ చిన్నారికున్న అంగవైకల్యం చిన్నబోయింది. ఎట్టకేలకూ ఆ చిన్నారి కష్టపడి మెట్లన్నీ ఎక్కిన తర్వాత.. జారుడు బల్ల మీదకు చేరుకోగానే ఆ చిన్నారి ముఖంలో కనిపించిన ఆనందానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
అయితే ఈ వీడియో చూశాక తనకు మరేదీ కష్టంగా అనిపించడం లేదని ఆనంద్ మహీంద్రా తెలిపారు. ఇక ఈ వీడియోకి భారీగా లైకులు, కామెంట్లతో నెటిజన్లు స్పందిస్తున్నారు. ఈ వీడియో ఎవరికైనా స్ఫూర్తిని కలిగించకపోతే మరేదీ స్ఫూర్తినివ్వలేదని ఓ నెటిజన్ ఆసక్తికర కామెంట్ చేశారు.
At first I couldn't bear to look & then I was left feeling uplifted. I don't think I will ever complain again about any job being too hard.. pic.twitter.com/06mzMAxxjp
— anand mahindra (@anandmahindra) September 11, 2017