ముస్లిం మత పెద్దలతో కేటీఆర్ భేటీ..

224
ktr
- Advertisement -

ముస్లిం మత పెద్దలతో హైదరాబాద్‌లో భేటీ అయ్యారు మంత్రి కేటీఆర్. కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సహకరిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. కరోనా మహమ్మారి నుండి బయటపడటమే మన ముందున్న లక్ష్యమని..రంజాన్‌ మాసం సందర్భంగా నిర్ణీత దూరాన్ని పాటించేందుకు తమ ఇండ్ల వద్దే ప్రార్థనలు చేసుకోవాలని నిర్ణయించామని తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

ముస్లిం మత పెద్దల నిర్ణయాన్ని స్వాగించారు మంత్రి కేటీఆర్. లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించడమే ప్రజల కర్తవ్యమని, లేనిపక్షంలో వైరస్‌ వ్యాప్తి చెంది ఇతర దేశాల్లో మాదిరిగా మన దగ్గర కూడా ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందన్నారు.

జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో మంత్రి మల్లారెడ్డితో పాటు మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌, ముస్లిం మత పెద్దలు ఖుబుల్‌ పాషా సత్తారీ, ముఫ్తీ ఖలీల్‌ అహ్మద్‌, మహ్మద్‌ పాషా, ఇఫ్తెకారి పాషా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -