కర్బూజ పండు తింటున్నారా..జాగ్రత్త!

43
- Advertisement -

ఎండ వేడిని పెంచుతూ వేసవి కాలం వచ్చేసింది. మార్చి నెల ప్రారంభంలోనే ఎండలు మండి పోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా శరీరం తరచూ డీహైడ్రేషన్ బారిన పడుతూ ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ ద్రవరూప పదార్థాలను అధికంగా సేవిస్తూ ఉంటారు. కూల్ డ్రింక్స్, ఫ్రూట్ జ్యూస్, కూల్ వాటర్.. వంటి వాటితో పాటు వేసవి సీజన్ లో మాత్రమే దొరిగే పుచ్చకాయ, కర్బూజ వంటి ఫలాలను కూడా తింటూ ఉంటారు. ముఖ్యంగా చాలమంది వేసవిలో కర్బూజ పండ్లను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు, ఎందుకంటే ఇది మంచి రుచిని కలిగి ఉండడంతో పాటు శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయ పడుతుంది. ఇందులో దాదాపు 90 శాతం నీటి కంటెంట్ ఉంటుంది. ఇంకా డీహైడ్రేషన్ ను తగ్గించి ఇమ్యూనిటిని పెంచే విటమిన్ సి కూడా మెండుగా ఉంటుంది.

అలాగే విటమిన్ కె, విటమిన్ బి6, వంటివి కూడా అధికంగా లభిస్తాయి. ఈ పోషకాల కారణంగా వేసవిలో ఏర్పడే ఆరోగ్య సమస్యలను దూరం చేయడంలో కర్బూజ పండు ఎంతో మేలు చేస్తుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. కర్బూజలో కెరోటిన్, లూటీన్ వంటి యాంటీఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండె జబ్బులను దూరం చేయడంలోనూ క్యాన్సర్ కణాలను ఎదుర్కోవడంలోనూ ముఖ్య పాత్ర పోషిస్తాయి. అందుకే ఈ వేసవి సీజన్ లో కర్బూజ పండ్లను తప్పనిసరిగా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే వీటిని అధికంగా తింటే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమౌతాయట. ముఖ్యంగా కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలతో పాటు కొన్ని సందర్భాల్లో విరేచనాలు కూడా అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి వేసవిలో కర్బూజ పండ్లను అతిగా తినరాదని, తింటే అదనపు ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Also Read:రాజకపోతాసనంతో ఉపయోగాలు!

- Advertisement -