నందాను నమ్ముకున్న తమన్..!

237
Music Director S Thaman Speech
- Advertisement -

టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌కు ఎత్తుగా ఉండే హీరోలంటే ఎంతో ఇష్టమంటున్నాడు. అందుకు ప్రత్యేక కారణం కూడా ఉందని చెప్పాడతను. హీరో ఎత్తుగా ఉంటే ఆ హైటుకు తగ్గట్లే యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా తీర్చిదిద్దుతారట. అలాంటి సన్నివేశాలు చూసి అతను స్ఫూర్తి పొంది.. బ్యాగ్రౌండ్ స్కోర్ చితగ్గొట్టేస్తాడట. గోపీచంద్ హీరోగా తెరకెక్కిన ‘గౌతమ్ నంద’ విషయంలోనూ అదే జరిగిందని చెప్పాడు తమన్.

Music Director S Thaman Speech

అయితే‘‘గౌతమ్ నంద సినిమాను సంపత్ నంది ఓ రంగుల హరివిల్లులా తీర్చిదిద్దారు. సంపత్ నంది సినిమాలకు పాటలు రాయడానికైనా.. సంగీతం చేయడానికైనా భయమే. ఎందుకంటే.. తను దేనికీ అంత త్వరగా సంతృప్తి పడడు. గోపీచంద్ అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా చెప్పాలంటే ఎత్తుగా ఉండే కథానాయకులంతా నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఎత్తు ఎక్కువ ఉన్న హీరోల సినిమాల్లో యాక్షన్ సీన్స్ బాగుంటాయి. వాటికి మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ చేయొచ్చు. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు.. వాటికి అందించిన నేపథ్య సంగీతం చాలా బాగుంటాయి. ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. ఈ సినిమా విడుదల రోజున అందరికంటే నేనే ఎక్కువ ఆనందంగా ఉంటా’’ అని తమన్ చెప్పాడు.

అయితే గత ఏడాది వరకు తెలుగులో తీరిక లేకుండా సినిమాలు చేసిన తమన్.. ఈ మధ్య జోరు తగ్గించాడు. ఈ మధ్య కాలంలో అతను చేసిన సినిమాలు ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ‘విన్నర్’ పాటలకు మంచి స్పందన వచ్చినా.. సినిమా ఫ్లాపైంది. దాని తర్వాత తమన్ నుంచి ఏ పెద్ద సినిమా రాలేదు. అందుకే అతను ‘గౌతమ్ నంద’పై భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది.

- Advertisement -