మొక్కలు నాటిన సంగీత దర్శకుడు కోటి..

249
Music Director Koti
- Advertisement -

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా గచ్చిబౌలిలోని హిల్ రిడ్జ్ విల్లాస్‌లో టాలీవుడ్ సంగీత దర్శకుడు కోటి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఛాలెంజ్ ప్రతినిధులు రాఘవ, కిషోర్ గౌడ్, టీఆర్ఎస్ నేత చక్రధర్ రెడ్డి పాల్గొన్నారు.

green challenge

ఈ సందర్భంగా కోటి మాట్లాడుతూ.. మొక్కలు నాటుతుంటే తన బాల్యం గుర్తుకు వచ్చిందన్నారు. మానవాళి బాగుండాలంటే ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలి అని ఆయన పిలుపునిచ్చారు. ఇంత గొప్ప కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్‌ కుమార్‌కు కోటి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సినీ దర్శకులు ఎస్.గోపాల్ రెడ్డి, బీ.గోపాల్, కోదండరామిరెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌కు ఈ గ్రీన్ ఛాలెంజ్ విసిరారు సంగీత దర్శకుడు కోటి.

koti

ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా నిర్వహించిన ఈచ్‌ వన్‌ ప్లాంట్‌ వన్‌ కార్యక్రమానికి అపూర్వ స్పందన వచ్చిందన్నారు. తన సొంత నియోజకవర్గమైన అచ్చంపేటలో పెద్ద ఎత్తున మొక్కలు నాటామని ఎమ్మెల్యే తెలిపారు. రాబోయే పదేళ్లలో తెలంగాణ రాష్ట్రం హరితవనంగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్‌ కుమార్‌కు గువ్వల బాలరాజు ధన్యవాదాలు తెలిపారు.

 

- Advertisement -