రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జోరుగా కొనసాగుతోంది. రోజురోజుకు ఈ కార్యక్రమంలో ప్రముఖులు పాల్గోంటూ పర్యవరణంపై ప్రజలో అవగహన కల్పిస్తున్నారు. ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన ఎంపీ సంతోష్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. తాజాగా ముషీరాబాద్ తహసీల్దార్ అయ్యప్ప గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గోన్ని కార్యలయ ఆవరణలో సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా అయ్యప్ప మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం గొప్ప అదృష్టంగా బావిస్తున్నానని అన్నారు. ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి వాటి సంరక్షించాలని కోరారు. అనంతరం అయ్యప్ప హిమాయత్ నగర్ తహసీల్దార్‌కు, ఖైరతాబాద్ తహసీల్దార్‌కు, మారేడ్‌పల్లి తహసీల్దార్‌కు ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గోన్ని మొక్కలు నాటాలని సవాలు విసిరారు.

