మురుగదాస్‌తో విక్రమ్‌!

75
vikram
- Advertisement -

కొంతకాలంగా సరైన హిట్ లేక ఇబ్బందులు పడుతున్న విక్రమ్ కథల ఎంపికపై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం విక్రమ్ నటించిన కోబ్రా విడుదలకు సిద్ధంగా ఉండగా తన నెక్ట్స్‌ ప్రాజెక్టుకు ఓకే చెప్పాడు.

కమర్షియల్‌ కథలకు సందేశం జోడించి తెరకెక్కించటంలో తమిళ దర్శకుడు మురుగదాస్‌ సిద్ధహస్తుడు. ఈ నేపథ్యంలో మురుగదాస్ చెప్పిన స్టోరీ నచ్చడంతో ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట విక్రమ్. భారీ బడ్జెట్‌ చిత్రాలను నిర్మించే సన్‌ పిక్చర్స్‌ ఈ సినిమాను నిర్మించనుండగా.. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ పనులపై మురుగదాస్‌ దృష్టి పెట్టారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.

విక్రమ్‌ నటిస్తున్న ‘కోబ్రా’ మే 28న విడుదల కానుండగా, మణిరత్నం దర్శకత్వంలో ‘పొన్నియన్‌ సెల్వన్‌’ శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది.

- Advertisement -