మహేష్ బాబు హీరోగా భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళం, మళయాలం భాషల్లో విడుదలవుతున్న సినిమా ‘స్పైడర్’. తమిళంలో తన డబ్బింగ్ తానే చెప్పుకున్న మహేష్.. పూర్తి స్థాయిలో నటించిన తమిళ చిత్రం కూడా ఇదే. ఈ నేపథ్యంలో ‘స్పైడర్’ చిత్రం ఆడియో వేడుకను చెన్నైలో నిర్వహించారు. ఈ సినిమా ఆడియో రజనీకాంత్‌ను ఇన్వైట్ చేసినప్పటికీ, ఆయన పలు కారణాల వల్ల రాలేకపోయారు. ఈ సందర్బంగా దర్శకుడు మురుగదాస్ ఆడియెన్స్‌తో రజనీకి సంబంధించిన ఆసక్తికర విషయాలను చెప్పారు.
“రజనీకాంత్ కి ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి వెళ్లినప్పుడు కార్డుపై మహేశ్ బాబును చూసి, ‘చిన్నప్పుడు చబ్బీగా ఉండేవాడని, ఇప్పుడు స్టైలిష్‌గా, రియల్ బాండ్ లా ఉన్నాడని రజనీ అన్నాడు. మహేష్ లుక్ బాగుందని మెచ్చుకున్నారు. ఆయన మహేశ్ గురించి చాలాసేపు మాట్లాడారు. రజనీ మాటలకు నేను థ్రిల్ ఫీల్ అయ్యాను. మహేష్‌బాబుతో తెలుగులో ‘గజనీ’, ‘తుపాకి’ చిత్రాలను రీమేక్ చేయాలని భావించా. ఇప్పటికి ‘స్పైడర్’ చేసే అవకాశం వచ్చింది. ప్రతీ సన్నివేశాన్ని రెండు భాషల్లో తెరకెక్కించాం. ఆఖరికి నిశ్శబ్ద సన్నివేశాలను కూడా. ‘స్పైడర్’ గురించి మాట్లాడడానికి ఇలాంటి వేదిక కోసం రెండేళ్లుగా వేచి చూస్తున్నా. 80 రోజుల పాటు రాత్రి షెడ్యూల్‌లో సినిమాను తెరకెక్కించాం. ఆ సమయంలో మహేష్‌బాబు చాలా సహకరించారు. ‘గజనీ’ కోసం ఆమీర్‌ఖాన్ ఎంత నిబద్ధతో పనిచేశారో ‘స్పైడర్’ కోసం మహేష్ అంతే అంకితభావంతో పనిచేశారు. ఆయన లేకుండా ఈ చిత్రాన్ని ద్విభాషా చిత్రంగా తెరకెక్కించ లేకపోయేవాళ్లమేమో. ఈ చిత్రంలో ఆయన పేరు ముందు ‘సూపర్‌స్టార్’ అని వేయొద్దన్నారు. ” అన్నాడు.
ఈ సినిమాకు ఇంటర్వెల్ బ్లాక్ ఈ సినిమా హైలెట్ అవుతుందన్నాడు మురుగదాస్. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా, తాను, మహేశ్, కార్తి, సూర్య, దర్శకుడు వెంకట్ ప్రభు చెన్నైలోని ఒకే స్కూల్ లో చదువుకున్నామని గుర్తు చేసుకున్నాడు. మిగతా అందరితో తాను సినిమాలు చేశానని, మహేశ్ తో మాత్రమే తీయలేదని, ఆ కోరిక ఇప్పుడు తీరిందని అన్నాడు. ‘గజనీ’ని మించిన హిట్ ను ‘స్పైడర్’ సొంతం చేసుకోనుందని అంచనా వేశాడు.