అతడు సినిమాపై మురళీ మోహన్

7
- Advertisement -

అతడు సినిమాపై మురళీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అతడు సినిమా కథ విన్నాక స్టార్టింగ్ లో హీరో క్యారెక్టర్ కొంచెం నెగిటివ్ గా ఉందని త్రివిక్రమ్ తో అన్నాను… అదే ట్రెండ్ అని, అలా ఉంటేనే జనాలకు నచ్చుతుందని అయన అన్నారు నిర్మాత మురళీ మోహన్.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అతడు . త్రిష క‌థానాయిక‌. ఈ చిత్రాన్ని ‘జయభేరి ఆర్ట్స్’ బ్యానర్ పై డి.కిషోర్, ముర‌ళీమోహ‌న్‌, ఎం.రామ్ మోహన్ లు కలిసి నిర్మించారు. 2005 వ సంవత్సరం ఆగస్టు 10న విడుదలైన మంచి విజ‌యాన్ని అందుకుంది.

Also Read:ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు సంచలన తీర్పు..

అత‌డు క‌థ‌ను త్రివిక్ర‌మ్ దాదాపు మూడు గంట‌లు చెప్పాడ‌ని, షాట్ టూ షాట్ చెప్పార‌న్నారు. క‌థ చాలా బాగుంద‌ని, అయితే.. ఆఖ‌ర్లో త‌న‌కు ఓ అనుమానం వ‌చ్చింద‌న్నారు. సినిమా మొద‌ట్లో హీరో నెగెటివ్ క్యారెక్ట‌ర్ ఉంటుంద‌ని అది త‌న‌కు న‌చ్చ‌లేదన్నారు. వ‌చ్చే ఏడాది జ‌య‌భేరీ బ్యాన‌ర్‌లో ఓ చిన్న సినిమా తెర‌కెక్కే అవ‌కాశం ఉంద‌న్నారు.

- Advertisement -