బీజేపీకి ఓటేయం..దయచేసి ఇబ్బందిపెట్టకండి

54
bjp
- Advertisement -

మునుగోడు రణక్షేత్రంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చుక్కలు కనిపిస్తున్నాయి. 22 వేల మెజార్టీతో 2018 ఎన్నికల్లో గెలిచిన కోమటిరెడ్డి సరిగ్గా మూడున్నర సంవత్సరాల తర్వాత 22 వేల కాంట్రాక్ట్ కోసం మునుగోడు ఉప ఎన్నికలకు కారణం కాగా ఇప్పుడు అదే ఆయన రాజకీయా భవిష్యత్‌ని ప్రశ్నార్థకంగా మార్చింది. మునుగోడు గడ్డపై రాజగోపాల్ రెడ్డికి ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తోంది.

ఏ గ్రామానికి వెళ్లిన ప్రజలు చీదరించుకుంటుండగా ములిగే నక్కపై తాటిమట్ట పడ్డట్లుగా బీజేపీ విధానాలు ఇప్పుడు ఆయన గెలుపును మరింత ప్రశ్నార్థకం చేస్తున్నాయి. రోజురోజుకు పెరిగిపోతున్న నిత్యావసర సరుకుల ధరలతో సామాన్యులు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటుండుగా మోడీ తీరుపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వంటగ్యాస్, పెట్రోల్,డీజీల్ ధరల పెరుగుదలకు అద్దు అదుపు లేకుండా పోవడంతో పేదల కష్టాలు మరింత రెట్టింపయ్యాయి.

ఈ నేపథ్యంలో మునుగోడులో ఓ గ్రామంలో రాజగోపాల్ రెడ్డికి వింత అనుభవం ఎదురైంది. గ్యాస్ ధరల పెంపుకు కారణమైన బీజేపీకి ఓటేసే పరిస్థితి లేదని దయచేసి మమ్మల్ని ఓటు అడిగేందుకు రావద్దని ఇంటికి పోస్టర్ అంటించారు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు ఆ పార్టీ నేతలు నిర్వహించిన సర్వేలో బీజేపీ మూడో స్ధానానికి పడిపోగా దీనిపై అమిత్ షా సైతం సీరియస్ అయినట్లు సమాచారం. మొత్తంగా మునుగోడు బైపోల్‌తో రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్ట్‌ ద్వారా లబ్దిపొందిన రాజకీయంగా మాత్రం తన గొయ్యిని తానే తవ్వుకున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -