- Advertisement -
మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ప్రచారానికి వెళ్లిన బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిని ఎక్కడికక్కడా నిలదీస్తున్నారు ప్రజలు. ఇక తాజాగా బీజేపీ అబద్దపు హామీలను నిలదీస్తూ పోస్టర్లు వెలిశాయి.
చౌటుప్పల్ మున్సిపాలిటీలో మునుగోడు ప్రజలారా.. మేం మోసపోయాం, మీరు మోసపోకండి అంటూ దుబ్బాక, హుజూరాబాద్ ప్రజల పేరుతో పోస్టర్లు అంటించారు చండూరు పట్టణంలో నేడే విడుదల అనే పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. షా ప్రొడక్షన్స్ సమర్పించు.. 18 వేల కోట్లు సినిమా సత్యనారాయణ 70 ఎంఎం థియేటర్‌లో నేడే విడుదలవుతుందని అంటించారు.
ఇప్పుడు ఈ పోస్టర్లు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. రాజగోపాల్ రెడ్డి వేలకోట్ల కాంట్రాక్టుల కోసం కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లారని ప్రజలే నిలదీస్తున్నారు.
- Advertisement -

