తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ పై మున్సిపల్ కమిషనర్ లను అలెర్ట్ చేశాం. అలాగే ఎన్నికలు ఉన్న మున్సిపాలిటీలలో ప్రభుత్వ పథకాలపై ప్రకటనలు చేయవద్దు. అధికారులు రాజకీయ కార్యక్రమంలలో పాల్గొనొద్దు. ఎక్కడా ప్రభుత్వ తరుపున బ్యానర్లు పెట్టవొద్దు. రాజకీయ పార్టీలు సమావేశాలు పెట్టవొద్దు. నోటిఫికేషన్ తరువాత అభ్యర్థుల వ్యయం పరిగణనలోకి తీసుకుంటామని నాగిరెడ్డి తెలిపారు.
ఇక డిపాజిట్ గతంలో ఉన్న విధంగానే ఉంటుందని.. ఈనెల 27 కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి.. 28న అన్ని పొలిటికల్ పార్టీలతో సమావేశం జరుపుతామన్నారు. 1.1.2019 ఓటర్ల జాబితాను పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇక ఎన్నికలకు కావల్సిన బ్యాలెట్ బాక్స్ ,బ్యాలెట్ పేపర్‌లు సిద్ధం చేశాం అదేవిధంగా అందరికి ట్రైనింగ్ కూడా ఇచ్చాము. పోలింగ్ స్టేషన్‌కు 800 మంది ఓటర్లు ఉంటారు.అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పేర్కొన్నారు.
ఎన్నికల ముఖ్యమైన తేదీలు
మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ తేదీ: జనవరి 7
నామినేషన్ల స్వీకరణ ప్రారంభం: జనవరి 8
నామినేషన్లకు చివరి తేదీ: జనవరి 10
నామినేషన్ల పరిశీలన: జనవరి 11
నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు: జనవరి 14
పోలింగ్: జనవరి 22
ఓట్ల లెక్కింపు: జనవరి 25