పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ పాకిస్థాన్‌ను ఎంతగా వణికించిందో, ఆ దేశ సైన్యాధిపతి ఆసిమ్ మునీర్ వ్యాఖ్యలే స్పష్టంగా చూపిస్తున్నాయి. ఇటీవల ఇస్లామాబాద్‌లో నిర్వహించిన ఉలెమా కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన మునీర్, భారత దాడుల సమయంలో పాక్ సైన్యాన్ని ఒక “దైవిక శక్తి” కాపాడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ శక్తి సహాయాన్ని తాము ప్రత్యక్షంగా అనుభవించామని కూడా ఆయన పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ప్రభావంతో పాకిస్థాన్ సైన్యం తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లిందన్న విషయాన్ని మునీర్ మాటలు పరోక్షంగా అంగీకరిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. సైనిక వైఫల్యాలు, వ్యూహాత్మక లోపాలను కప్పిపుచ్చుకునేందుకే పాక్ ఆర్మీ చీఫ్ మతపరమైన వ్యాఖ్యలకు దిగుతున్నాడని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
భారత దాడుల ముందు పాకిస్థాన్ సైన్యం అప్రమత్తంగా వ్యవహరించలేకపోయిందన్న విమర్శలు ఇప్పటికే ఆ దేశంలో వెల్లువెత్తుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో “దేవుడే కాపాడాడు” అనే వ్యాఖ్యలు చేయడం ద్వారా సైన్యంపై ఉన్న అసంతృప్తిని తగ్గించాలన్న ప్రయత్నంగా ఈ వ్యాఖ్యలను చూస్తున్నారు.
మరోవైపు, ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ ఉగ్రవాదంపై తన కఠిన వైఖరిని స్పష్టంగా చాటిందని అంతర్జాతీయ రక్షణ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పాక్ సైనికాధిపతి వ్యాఖ్యలు ఆ ఆపరేషన్ ప్రభావాన్ని మరింత బలంగా నిరూపిస్తున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Also Read:BMC Polls:శివసేన–ఎంఎన్‌ఎస్ కూటమి

