నవంబర్‌లో మున్సిపల్ ఎన్నికలు: సీఎం కేసీఆర్

524
pragathi bhavan
- Advertisement -

నవంబర్ లోపు మున్సిపల్ ఎన్నికలను నిర్వహిస్తామని తెలిపారు సీఎం కేసీఆర్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్….ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో రెండు,మూడు రోజుల్లో ఈసీని కలిపి ప్రభుత్వ పరంగా నివేదిక ఇస్తామన్నారు.

నెల రోజుల్లోపు మున్సిపల్ ఎన్నికలను నిర్వహించి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని తీసుకొస్తామన్నారు. పల్లె ప్రగతికి రాజకీయాలకు అతీతంగా మంచి స్పందన వచ్చిందన్నారు. ఈ స్పూర్తితోనే మున్సిపాలిటీల్లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నెల లేదా 20 రోజుల పాటు తీసుకొస్తామన్నారు. దీని ద్వారా పట్టణాల రూపు రేఖలు మారుతాయని చెప్పారు.

- Advertisement -