గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ సాబేర్ అలీ..

53
gic

రాజ్యసభ సభ్యులు ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మున్సిపల్ కమిషనర్ MD.సాబేర్ అలీ మొక్కలు నాటారు. మణికొండ మున్సిపల్ కమిషనర్ గారు విసిరినా ఛాలెంజ్ స్వీకరించి ఈరోజు శంషాబాద్ మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలో మొక్కలు నాటారు.

ఈ కార్యక్రమం బాగా విజయవంతమైనది , పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతుంది అని , ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని , ఈ సందర్బంగా ఎంపీ సంతోష్ కుమార్ గారిని అబినందించారు . ఈ చాలెంజ్ ని ఇలానే కొనసాగాలని మరో ముగ్గురికి శరత్ చంద్ర వికారాబాద్ , శ్యామసుందర్ వేములవాడ , జయత్ కుమార్ రెడ్డి షాద్నగర్ మున్సిపల్ కమిషనర్లకు ఛాలంజ్ విసిరారు.