భారీ వర్షాలు….స్కూళ్లకు సెలవు

515
mumbai ranis
- Advertisement -

భారీ వర్షాలతో ముంబై అతలాకుతలం అయింది. ఓ వైపు భారీ వర్షాలతో ఇప్పటివరకు పదుల సంఖ్యలో మృతిచెందగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇవాళ కూడా భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన మహారాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు సెలవు ప్రకటించింది.

ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు శిథిలావస్థలో ఉన్న కట్టడాలు కూలుతున్నాయి. మలాడ్ ఈస్ట్ ప్రాంతంలోని పింప్రిపాదలో గోడకూలి 12 మంది మృతి చెందారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ముంబై సమీపంలోని కల్యాణ్‌లో పాఠశాల గోడ కూలి ఓ మూడేళ్ల బాలుడు సహా ముగ్గురు మృతి చెందారు. పురాతన భవనాలు పక్క గుడిసెల్లో నివస్తున్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ముంబైలోని ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.

- Advertisement -