బెంగుళూరులోని చిన్న స్వామి స్టేడియంలో నిన్న జరిగిన ముంబై వర్సెస్ బెంగుళూర్ మ్యాచ్ లో ముంబై విజయం సాధించింది. ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ పోరులో 6 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ బోణి కొట్టింది. టాస్ గెలిచి ఫిల్డిండ్ ఎంచుకున్న బెంగుళూరు టీం. నిర్ణిత 20ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 187పరుగులు చేసింది ముంబై. ఈమ్యాచ్ లో అద్భుతంగా ఆడిన కెప్టెన్ రోహిత్ శర్మ 33బంతుల్లో 46పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఓపెనర్ సూర్యకూమార్ యాదవ్ 24 బంతుల్లో 38 పరుగులు చేశాడు.
ఆ తర్వాత గ్రీసు లోకి వచ్చిన యువరాజ్ సింగ్ 12బంతుల్లో 23పరుగులు చేసి బెంగుళూరు బౌలర్లకు చుక్కలు చూపించాడు. వరుసగా 3సిక్స్ లు కొట్టి నాలుగో బంతికి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా 14బంతుల్లో 32పరుగులు సాధించాడు. అనంతరం 188పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగుళూరు నిర్ణిత 20ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 181పరుగులు మాత్రమే చేయగలిగింది. ఏబీ డివిలియర్స్ పొరాటం వృధా అయిపోయింది. డివిలియర్స్ 41బంతుల్లో 70పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇక కెప్టెన్ విరాట్ కోహ్లి 32బంతుల్లో 46పరుగులు చేసి అవుట్ అయ్యాడు. బెంగుళూరు ఆడిన రెండు మ్యాచ్ లు ఓడిపోయిన విషయం తెలిసిందే.