ఎట్టకేలకు బోణి కొట్టిన ముంబై..

53
rr
- Advertisement -

ఐపీఎల్‌ 15వ సీజన్‌లో ఎట్టకేలకు బోణి కొట్టింది ముంబై. రాజస్థాన్‌ విధించిన 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 19.2ఓవర్లలో 5 వికెట్లు కొల్పోయి లక్ష్యాన్ని చేధించింది.

ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ సూర్యకుమార్‌ (39 బంతుల్లో 51; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడగా, తిలక్‌ వర్మ (30 బంతుల్లో 35; 1 ఫోర్, 2 సిక్స్‌లు) రాణించాడు. సూర్య, తిలక్‌ మూడో వికెట్‌కు 56 బంతుల్లో 81 పరుగులు జోడించి జట్టును విజయం దిశగా నడిపించారు. చివర్లో టిమ్‌ డేవిడ్‌ (9 బంతుల్లో 20 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) జట్టును విజయతీరానికి చేర్చాడు.

అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. జోస్‌ బట్లర్‌ (52 బంతుల్లో 67; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీ మినహా మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు.

- Advertisement -